అమర్నాథ్ భక్తులకు శుభవార్త.. జూన్ 30 నుంచి
జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్రను ప్రారంభించనున్నట్టు అమర్నాథ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. బోర్డు సమావేశం జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగింది. జూన్ 30న యాత్రను ప్రారంభించి సప్రదాయం ప్రకారం రక్షా బంధన్ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయిచారు. 43 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో భక్తులు కొవిడ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి చేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు ఎత్తివేయడంతో ఈసారి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అంచనా వేస్తోంది. గత రెండేళ్లుగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నామమాత్రంగా నిర్వహించారు. హిమాలయాల్లో దక్షిణ కశ్మీర్ కొండల్లో 3,800 మీటర్ల ఎత్తులో మంచు ఆకారంలో పరమశివుడు కొలువై ఉంటాడని భక్తుల విశ్వాసం. ప్రతి ఏడాది రక్షాబంధన్ రోజున ఈ యాత్రను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.













