21 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
ఈ నెల 21 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. కేవలం 10,000 మంది యాత్రికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తోంది. అయితే ఈ సారి మాత్రం బాల్టాల్ దారి గుండానే అనుమతి ఉంటుందని సమాచారం. అయితే హెలికాప్టర్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయమేమీ తీసుకోలేదు. అయితే అమర్నాథ్ గుహ దగ్గరికి మాత్రం కేవలం 500 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తున్నట్లు సమాచారం. కేవలం 55 ఏళ్ల వయస్సు ఉన్న భక్తులను మాత్రమే అనుమతి ఇవ్వాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 21 జూలై నుంచి ఆగస్టు 3 వరకూ ఈ యాత్ర కొనసాగుతుంది.













