అమర్నాథ్ యాత్ర రద్దు
కశ్మీర్లో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఈ యేడాది జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకు జరగాల్సిన అమర్నాథ్ యాత్రని రద్దు చేస్తున్నట్లు అమర్నాథ్ బోర్డు చైర్మన్, లెఫ్టినెంట్ గవర్నర్ జిసి ముర్ము అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఈ యేడాది అమర్నాథ్ యాత్ర నిర్వహణ సాధ్యంకాదని, ఈ యాత్ర రద్దు చేయాల్సి రావడం బాధగా ఉందని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే పూజా కార్యక్రమాలను రోజూ రెండు సార్లు టెలివిజన్ చానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించారు.













