అమర్నాథ్ యాత్రకు బ్రేక్
అమర్నాథ్ తీర్థ యాత్రకు రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూన్నామని, మెరుగుపడిన తర్వాత రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభిస్తామని అమర్నాథ్ ఆలయ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితీశ్వర్ కుమార్ చెప్పారు. పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా అమర్నాథ్ యాత్రకు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ఆఫ్లైన్, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 56 రోజుల ఈ యాత్ర జూన్ 28న ప్రారంభమై ఆగస్టు 22న ముగుస్తుంది.













