పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకున్నది. తీవ్ర ఒత్తిడితో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి తెరపడిరది. రాజ్‌భవన్‌కు చేరుకుని అమరీందర్ సింగ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సీఎల్పీ భేటీకి ముందే రాజీనామా చేయడం గమనార్హం. సీఎల్పీ భేటీ మరోసారి నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడం తనను మనస్తాపానికి గురిచేసినట్లు అమరీందర్ పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా అనంతరం మీడియాకు తెలిపారు. తన మద్దతుదారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించారు. కొత్త సీఎం ఎవరో తనకు తెలీదని చెప్పారు.













