అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. తాము అధికారంలోకి వస్తే
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే గృహోపకరణాల కోసం 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయ ట్వీట్ చేశారు. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ కొత్త సంవత్సరం యూపీకి కొత్త వెలుగులు తీసుకొస్తుందని పేర్కొన్నారు.













