ఏకే ఆంటోనీ కీలక నిర్ణయం.. రాజకీయాలకు
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రక్షణ శాఖ మాజీ మంత్రి ఎకే ఆంటోనీ రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు. జాతీయ రాజకీయాల నుంచి కూడా క్రమంగా నిష్క్రమించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసీ)లో సభ్యులుగా కొనసాగుతున్నారు. 1973లో తన 33 ఏళ్ల వయస్సులో కేరళ పీసీసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కేరళ పీసీసీకి పిన్న వయస్సులో ఎన్నికైన ఆంటోని రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. 1978లో కాంగ్రెస్(ఎ) పేరుతో సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్కు నాలుగేళ్లు దూరంగా ఉన్నారు. 1982లో కాంగ్రెస్లో మళ్లీ చేరారు. మూడుసార్లు కేరళ ముఖ్యమంత్రిగానూ, సుదీర్ఘకాలం దేశ రక్షణ మంత్రిగానూ ఆంటోని పని చేశారు.













