కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు.. ఆ పదవీ ఖాళీ లేదు
మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం సీఎం పదవి ఖాళీ లేదని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో దీర్ఘకాలం తమ పార్టీని ముందుండి నడిపిస్తూ అజిత్ పవార్ ప్రముఖ నేతగా ఎదిగారని అన్నారు. రాబోయే రోజుల్లో అజిత్ పవార్ మహారాష్ట్ర సీఎం పగ్గాలు చేపడతారని, ఈ దిశగా తాము సరైన వ్యూహంతో ముందుకెళుతున్నామని తెలిపారు. మహారాష్ట్రంలో ఏక్నాథ్ షిండే సారధ్యంలోని బీజేపీ`శివసేన సర్కార్కు అజిత్ పవార్ వర్గం అనూహ్యంగా మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.













