నేటి నుంచి కొత్త నిబంధనలు… ఫేస్‍బుక్

భారతదేశ కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‍బుక్ తెలిపింది. నేటి నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే, కొత్త మార్గదర్శకాలకు సంబంధించిన కొన్ని సమస్యలను ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపింది. తమ వేదికపైన ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ భావాలను వెలిబుచ్చుకునేందుకు ఫేస్‍బుక్ కట్టుబడి వుందన్నారు. ఫేస్‍బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలనీ కొత్త నిబంధనలను పాటించేందుకు ఉన్న మూడు మాసాల గడువు ముగిసింది.