రామ్‍దేవ్ బాబాకు షాక్…భూటాన్ బాటలోనే నేపాల్

యోగా గురువు, పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‍దేవ్ బాబాకు భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్ సోకకుండా తీసుకువచ్చిన కరోనిల్ మందును భూటాన్ నిలిపివేయగా తాజాగా నేపాల్ ఆ మందును వాడకూడదని ఆదేశించింది. తాజాగా నేపాల్ ఆ మందుల పంపిణీని నిలిపివేసింది. రామ్‍దేవ్ బాబా బహుమతిగా అందించిన 1,500 కరోనిల్ కిట్లను వాడకూడదని నిర్ణయించింది. ఎందుకంటే కరోనా వైరస్‍ను ఎదుర్కోనడంలో కరోనిల్ విఫలం చెందిందని గుర్తించింది. ఈ మేరకు ఆ దేశ ఆయుర్వేద మంత్రిత్వ శాఖ కరోనిల్ మందును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనిల్ కిట్‍లో ఉన్న ట్యాబ్లెట్లు, నూనె కరోనా వైరస్‍ను కట్టడి చేయడంలో విఫలం పొందినట్లు పేర్కొంది. దీంతో ఆ కిట్‍ను పంపిణీ చేయడం నిలిపివేసింది. కరోనిల్‍కు ప్రత్యామ్నాయ మందులను నేపాల్ ప్రభుత్వం ఆర్డర్లు చేసింది.