ఈ-వీసా పైనే భారత్ కు
అఫ్గాన్నిస్తాన్ పౌరులు ఇకపై ఈ-వీసా పైనే భారత్‌కు రావాలని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం అక్కడి భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అప్గానిస్తాన్‌ను వీడి రావాలని అనుకున్నవారికి ఈ వెసులుబాటు కల్పిస్తామని, మొదట హిందువులు, సిక్కులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే తాజాగా ఇకపై ఎమర్జెన్సీ వీసా తప్పనిసరి అని, పాత వీసాలు ఇక చెల్లబోవని హోంశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఈ ఎమర్జెన్సీ ఎక్స్ ఎంఐఎస్సీ, వీసా అప్లికేషన్ ప్రాసెస్‌ని స్ట్రీమ్ లైన్ చేశామన్నారు. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చే అఫ్గాన్ పౌరులందరికీ ఈ కొత్త వీసా తప్పనిసరి అని వారు పేర్కొన్నారు.













