పార్టీలతో సంబంధం లేదు.. అయోధ్యకు వెళ్తా
అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తాను తప్పకుండా వెళ్తానని ఆప్ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, ఇతర పార్టీలు హాజరైనా, కాకపోయినా తాను పట్టించుకోనన్నారు. రాముడి ఆశీర్వాదం కోసం కచ్చితంగా వెళ్తానన్నారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారికి నచ్చింది చేసుకోవచ్చని చెప్పారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రామ మందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రాణ ప్రతిష్ఠకు వెళ్లకూడదని ఆప్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ పరిణామాల వేళ హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.













