స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు

పంజాబ్‌లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్‌సర్ చేరుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. శ్రీదుర్గియానా దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అమృత్‌సర్ ఆప్ అభ్యర్థి కుల్దీప్ సింగ్ ఉన్నారు. అనంతరం అమృత్‌సర్‌లో చేపట్టిన రోడ్‌షోలో కేజ్రీవాల్ మాట్లాడుతూ తాము తిరిగి జైలుకు వెళ్లకూడదని భావిస్తే ప్రజలంతా ఆప్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలను జూన్ 1న పోలింగ్ జరగనుంది.