బ్రిటీష్ కొలంబియా ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు విజయం
కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది భారత సంతతి అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉండటం వివేషం. ఎన్నికల్లో అధికార న్యూడెమొక్రటిక్ పార్టీ (ఎన్డిపి) మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించింది. భారత్-కెనడాకు చెందిన జగ్మీత్ సింగ్ నేతృత్వంలో నడుస్తోన్న ఎన్డిపి రాష్ట్రంలో 87 అసెంబ్లీ స్థానాలకు గానూ 55 స్థానాలు సాధించింది. విజయం సాధించిన భారత-కెనడియన్లలో డిప్యూటీ స్పీకర్ రాజ్ చౌహాన్, కార్మిక శాఖ మంత్రి హ్యారీ బెయిన్స్, జగ్పూర్ బ్రార్, రవి కహ్లోన్ తదితరులు ఉన్నారు. భారత సంతతి మహిళల్లో మాజీ మంత్రి జిన్నీ సిమ్స్, నిక్కి శర్మ, రచనా సింగ్ పోటీ చేసి గెలుపొందారు.













