జనవరి 11 నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు… తప్పనిసరిగా

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను సవరించింది. ఇందులో భాగంగానే ముప్పు ఎక్కువ ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు భారత్కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. ఎనిమిదో రోజు కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 11 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడిరచింది.
యూకే సహా ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజికిస్థాన్, కెన్యా, నైజీరియా, టునీషియా, జాంబియా దేశాలను కేంద్రం ఎట్ రిస్క్ దేశాలుగా పరిగణించింది.











































































