ఆ ప్రయాణికులకు 7 రోజుల క్వారెంటైన్
ఎయిర్ ఇండియా విమానంలో యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్లో ఉండాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా ఏడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ తప్పనిసరని, ఆ తర్వాత విధిగా మరో ఏడు రోజులు హోమ్ క్వారెంటైన్లో ఉండాలని ఢిల్లీ సర్కారు ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రకటన చేశారు. ఇటీవల యూకేలో కరోనా న్యూ స్ట్రెయిన్ మొదలై వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్రం భారత్- యూకే మధ్య విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో ఎయిర్ ఇండియా విమానం యూకే నుంచి 246 మంది ప్రయాణికులతో ఢిల్లీకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆఫ్లైట్లో వచ్చిన ప్రయాణికులందరికీ ఏడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ నిబంధన విధించారు.













