కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్…
కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన 50 మందికి పైగా సీనియర్ నేతలు మూకుమ్మూడి రాజీనామాలను ప్రకటించారు. ఇటీవల హస్తం పార్టీని వీడిన గులాంనబీ ఆజాద్‌కు మద్దతుగా వారంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆజాద్‌కు మద్దతుగా మేం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను సమర్పించాం అని మాజీ ఎమ్మల్యే బల్వాన్ సింగ్ మీడియా తెలిపారు. వారు తమ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నారు. తాజాగా బయటకు వెళ్లిన వారిలో ఉప ముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల్ మాజిద్ పని, మనోహర్ లాల్ శర్మ, షురు రామ్ తదితరులు ఉన్నారు.













