అతిక్రమించారో… 5 ఏళ్ల జైలు.. కోటి జరిమానా
ఢిల్లీ…. ఈ పేరు వినగానే దేశ రాజధాని ఠక్కున గుర్తొస్తుంది. మరో విషయం కూడా గుర్తొస్తుంది. కాలుష్యం. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సర్కార్ కఠిన నిబంధనలతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కొత్త చట్టాలతో కఠిన నిబంధనలను అమలు చేయనుంది. ఇకపై కాలుష్యానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే 5 ఏళ్ల జైలు, లేదా కోటి రూపాయల జరిమానాను విధించనున్నారు. ఉల్లంఘన తీవ్రత అధికంగా ఉంటే రెంటినీ విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఓ ఆర్డినెన్స్ ను కూడా జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకూ కూడా వర్తిస్తుందని తేల్చి చెప్పింది.
18 మంది సభ్యులు…
18 మంది సభ్యులతో ఈ కమిషన్ ఏర్పాటైంది. దీనికి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి లేక, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్ధి స్థాయి అధికారి చైర్మన్ గా ఉంటారు. 10 మంది అధికారులతో పాటు మరికొందరు నిపుణులు, కార్యకర్తలు ఉంటారు. వాయు నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు దానికి సంబంధించిన చట్టాలను ఈ కమిటీ చేస్తుంది. తన వార్షిక నివేదికలను కమిషన్ పార్లమెంట్ కు సమర్పిస్తుంది.













