ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం…. సీబీఐ కస్టడీకి సిసోడియా
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. రేపటి నుంచి మార్చి 4 వరకు సిసోడియాను కస్టడీలోకి తీసుకొని సీబీఐ విచారించనుంది. కేసు దర్యాప్తులో భాగంగా ప్రశ్నించగా సిసోడియా పొంతలేని సమాధానాలు చెప్పారని, తమ వద్ద ఉన్న ఆధారాలకు ఆయన చెబుతున్న సమాధానాలకు సరిపోవడం లేదని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. సమాధానాన్ని దాటవేసే ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారని కోర్టుకు వివరించింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు ఆయన్ని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతివ్వాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటు చేసుకున్న వ్యవహారంపై సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు.













