ఏనుగులకు కరోనా వైరస్!

తమిళనాడు రాష్ట్రంలో 28 గజరాజులకు కరోనా వైరస్ సోకింది. ముడుమలై టైగర్ రిజర్వులోని ఏనుగులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‍గా తేలింది. తెప్పకుడు క్యాంప్‍లోని 26 పెద్ద ఏనుగులు, రెండు పిల్ల ఏనుగుల శాంపిళ్లను యూపీలోని ఇజత్‍నగర్ వెటర్నరీ రీసెర్చి ఇన్‍స్టిట్యూట్‍కు పంపారు. అరినరగ్ అన్నా జంతు ప్రదర్శనశాలలోని తొమ్మిది సింహాలకు పాజిటివ్ సోకడంతో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూలలో కొవిడ్ పరీక్షలు చేపడుతున్నారు. ఏనుగుల తొండం, పురీషనాళం నుంచి నమూనాలు సేకరించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా, ఏనుగులకు దాణా వేసేవారి ఉష్ణోగ్రతలు పరిశీలించాకే విధులకు అనుమతిస్తున్నారు. ఈ శిబిరంలో 52 మంది మావుట్లు, 27 మంది సహాయకులు ఉన్నారు. వీరికి కూడా టీకాలు వేస్తున్నారు.