విదేశీ విద్యార్థులకు 25 శాతం : యూజీసీ చైర్మన్
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో విదేశీ విద్యార్థుల కోసం 25 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు పెంచుకునేందుకు అనుమతించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ సీట్లలో ప్రవేశం పొందేందుకు ప్రవేశ పరీక్ష కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. మనదేశంలో యూజీ, పీజీ కార్యక్రమలను అంతర్జాతీయీకరణ చేయడంపై గత వారం జరిగిన యూజీసీ సమావేశంలో సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలకు అనుమతించిన విద్యార్థుల సంఖ్యకు పైడి ఈ అదనపు సీట్లను పెంచుతారు.













