కుమారస్వామి సంచలన ప్రకటన
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి క్రమంగా పుంజు కుంటోంది. జనతాదళ్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలో తనకు చిట్టచివరి ఎన్నికలని తెలిపారు. పంచరత్న ప్రచారంలో భాగంగా చెన్నైపట్నలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కుమారస్వామి మాట్లాడుతూ తాను పోటీకి దూరమైనప్పటికీ రాజకీయాల్లో చురుకుగా ఉంటానని తెలిపారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేసేది లేదు. రాజకీయాలతో బాగా అలసిపోయాను. విశ్రాంతి అవసరం. అయినప్పటికీ యాక్టివ్ పాలిటిక్స్‌కు ఎప్పటికీ దూరం కాను అని అన్నారు.













