వారికి మాత్రం 2డీజీ ఔషధం ఇవ్వొద్దు : డీఆర్డీవో హెచ్చరిక

కరోనా బాధితుల కోసం డీఆర్‌డీవో రూపొందించిన 2డీజీ ఔషధాన్ని ఎవరు తీసుకోవచ్చో, ఎవరు తీసుకోకూడదు? అన్న దానిపై డీఆర్‌డీతో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని హెచ్చరించింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును తీసుకోవాలని సూచించింది.
మధ్యస్థం నుంచి తీవ్రంగా కోవిడ్‌తో బాధపడుతున్న కోవిడ్ రోగులకు 10 రోజుల్లో ఈ ఔషధాన్ని సూచించాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపున్న వారికి ఈ ఔషధాన్ని ఇవ్వరాదని సూచించింది. మధుమేహం, హృద్రోగ, శ్వాసకోస, హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మంట్ సమస్యలు ఉన్నవారి విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని డీఆరోడీవో తెలిసిపింది. ఈ ఔషధం కోసం రోగులు గానీ, వైద్య సిబ్బంది గానీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను సంప్రదించాలని సూచించింది. మరోవైపు ఈ ఔషధం ధర 990 రూపాయలుగా రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించిన విషయం విదితమే. చికిత్సలో ఒక్కొక్కరికి 5 నుంచి 10 సాచెట్‌లు అవసరం.