రాజ్యసభలో ఆందోళనలు.. 19 మంది ఎంపీలు సస్పెన్షన్
రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడం, సభా మర్యాదను ఉల్లంఘించేలా ప్రవర్తించినందుకు గానూ 19 మంది ఎంపీలను చైర్మన్ హోదాలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభ నుంచి సస్పెండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఏడుగురు, డీఎంకేకు చెందిన ఆరుగురు, సీపీఎంకు చెందిన ఇద్దర్దు, సీపీఐ ఎంపీ, టీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవి, దామోదర్ రావు, లింగయ్య యాదవ్ ఈ వారం వరకు సభకు హాజరుకావొద్దని ఆదేశించారు. పార్లమెంట్ వర్షాకాల సమాశాల్లో భాగంగా ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ వడ్డింపు వంటి అంశాలను వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. లోక్సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేలు పడిన విషయం తెలిసిందే.













