ఆంధప్రదేశ్ కు 11… తెలంగాణకు 14
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలు అందించనున్నారు. సైనిక, పోలీస్ అధికారులకు కేంద్రహోంశాఖ వివిధ పతకాలు ప్రకటించింది. వీటిలో ఆంధప్రదేశ్‌కు చెందిన 11 మందికి, తెలంగాణ చెందిన 14 మంది గ్యాలంటరీ పోలీసు పతకాలు దక్కాయి. తెలంగాణకు చెందిన 14 మంది పోలీసు అధికారులకు గ్యాలంటరీ పోలీసు పతకాలు, ఆంధప్రదేశ్‌కు చెందిన 11 మందికి ఉత్తమ సేవా పోలీసులు పతకాలు వరించాయి. తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, వుమెన్ సేఫ్టీవింగ్ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామా వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసులు పతకాలు దక్కాయి. వీటిని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అందజేయనున్నారు.













