వేలానికి ప్రధాని మోదీ బహుమతులు
రాజకీయవేత్తలు, క్రీడాకారుల సహా వివిధ వ్యక్తుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన 1200లకు పైగా బహుమతులను ఈ నెల 17 నుంచి వేలానికి ఉంచుతున్నారు. ఇలా వచ్చే నిధులను గంగా నది ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగా మిషన్‌కు వెచ్చిస్తారు. ఈ వేలం ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుంది. ఈ వేలం అక్టోబరు 2న పూర్తవుతుంది. ఈ మేరకు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రాన్ ఆర్ట్ డైరెక్టర్ జనరల్ అద్వైత గదానాయక్ వెల్లడించారు. ఈ వస్తువుల ప్రారంభ ధర రూ.100 నుంచి 10 లక్షల వరకూ ఉంది.
వేలంలో కానుకల జాబితాలో రాణి కమలావతి విగ్రహం, హనుమాన్ విగ్రహం, సూర్యుడి పెయింటింగ్, త్రిశూలం, మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం, వేంకటేశ్వరస్వామి ప్రతిమ, క్రీడాకారులు సంతకాలు చేసిన టీ షర్టు, బ్యాక్సింగ్ గ్లౌజ్‌లు, హస్తకళలు, జానపద కళాఖండాలు, సంప్రదాయ అంగవస్త్రాలు, శాలువా తలపాగాలు, ఉత్సవ ఖడ్గాలు మొదలైన వస్తువులు ఉన్నాయి.













