యూ వైబింగ్ సంచలనం …63 ఏళ్ల రికార్డు బద్దలు
చైనాకు చెందిన టెన్నిస్ ఆటగాడు యూ వైబింగ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో చరిత్ర సృష్టించాడు. 63 ఏళ్ల తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో చైనా నుంచి సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో విజయం సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 174వ ర్యాంకర్ అయిన యూ వైబింగ్, తొలి రౌండ్లో జార్జేరియాకు చెందిన 31వ సీడ్ నికోలోజ్ బాసిలాష్విలిని 6`3, 6`4, 6`0తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. వైబింగ్ మ్యాచ్‌లో తొమ్మిది ఏస్‌లు 31 విన్నర్లు సంధించాడు. టెన్నిస్‌లో మేజర్ గ్రాండ్‌స్లామ్‌లు చూసుకుంటే 1959 తర్వాత చైనా నుంచి ఒక ఆటగాడు వింబుల్డన్‌లో మెపుచి మాత్రమే మేజర్ విజయాలు సాధించాడు. ఇక 1935లో చైనాకు చెందిన చెంగ్ గయ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌తో తొలి రౌండ్ మ్యాచ్ గెలిచాడు.













