అమెరికా ఉపాధ్యక్షురాలు హోలీ శుభాకాంక్షలు…
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ సందర్భంగా తేడాలను మరిచిపోయి కలిసి సాగుదాం అని ఒక వీడియో సందేశంలో కమలా హారిస్ పేర్కొన్నారు. ఈ పండుగ సానుకూలతకు ప్రతీక అని కూడా అమె అన్నారు. హ్యాపీ హోలీ ప్రియమైనవారికి వర్తించే శక్తివంతమైన రంగులకు ప్రసిద్ధి చెందింది. ఆనంతంతో నిండిన హోలీ అందరికీ అనుకూలతలకు చిహ్నంగా ఉన్నది. హోలీ రంగుల్లో మాదిరిగానే మనం కూడా తేడాలను మరిచిపోయి కలిసి సాగుదాం అంటూ ఎంతో అర్ధమున్న శుభాకాంక్షలను కమలా హారిస్ తన వీడియో సందేశం ద్వారా తెలిపారు.













