హెచ్-1బీ వీసా దరఖాస్తులకు… మరో అవకాశం

అమెరికాలో ఉంటున్న విదేశీ ఉద్యోగులకు మరో మారు హెచ్ 1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఆ దేశ ప్రభుత్వం కల్పించింది. గతంలో ఉన్న గడువు తేదీ (ఇనిషియల్ రిజిస్ట్రేషన్ పీరియడ్) కారణంగా దరఖాస్తులు తిరస్కరణకు గురైన వాళ్లకు ఈ అవకాశం ఇచ్చారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వీసా దరఖాస్తు ఇప్పటికే తిరస్కరణకు గురైనప్పటికీ మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కొంతమంది విదేశీ ఉద్యోగ నిపుణులకు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 1లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.