90 వేల డాలర్లకు.. క్యాపిటల్ హిల్ దాడి వీడియోలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్ బిల్డింగ్‍పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఉటాక్‍కు చెందిన జాన్ ఎర్తీ సులివాన్ క్యాపిటల్ హిల్‍పై దాడి జరిగిన రోజున అక్కడ ఉన్నారు. జర్నలిస్టుగా దాడి ఈవెంట్‍ను కవర్ చేసేందుకు వచ్చినట్లు చెప్పుకున్న సులివాన్ ఆ తర్వాత క్యాపిటల్ హిల్ లోపల జరిగిన హింసాత్మక ఘటనలను షూట్ చేశాడు. ఆ పూటేజ్ మొత్తాన్ని అతను మీడియా సంస్థలకు 90 వేల డాలర్లకు అమ్ముకున్నట్లు తెలిసింది. అయితే ఆ దాడి దృశ్యాలను చిత్రీకరించి, వాటిని మీడియా సంస్థలకు అమ్మిన జాన్ ఎర్తీ సులివాన్ నుంచి అమెరికా అధికారులు సుమారు 90 వేల డాలర్లు సీజ్ చేశారు. గత ఏడాది అమెరికాలో జరిగిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో అతను పాల్గొన్నాడు. అతనిపై మొత్తం 8 నేరాభియోగ కేసులను నమోదు చేశారు. క్యాపిటల్ హిల్ దాడి ఘటనలో మొత్తం 440 మందిపై కేసు బుక్ చేశారు. సులివాన్‍తో పాటు అనేక మంది దాడికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.