యూఎస్ ఓపెన్ లో అల్కరాజ్, స్వియాటెక్ కు ఎంట్రీ
యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) టెన్నిస్ అసోసియేషన్ 2023 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు సంబంధించిన ఎంట్రీ లిస్టును తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రస్తుత ప్రపంచ నంబర్ 1 పురుషుల, మహిళల టెన్నిస్ స్టార్లు కార్లోస్ అల్కరాజ్, ఇగా స్వియాటెక్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 10 వరకు న్యూయార్క్ ఫ్లషింగ్‌లోని యూఎస్‌టీఏ బిల్జీజన్కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్లో యూఎస్ ఓపెన్ టోర్నీ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్లుగా అల్కరాజ్, స్వియాటెక్ నేరుగా బరిలోకి దిగుతారు.













