భారతీయ విద్యార్థుల కోసం.. ప్రత్యేక స్కాలర్షిప్
న్యూజిలాండ్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయం, వైపాపా టౌమాటా యూనివర్సిటీ ఆటోరోవా భారతీయ విద్యార్థుల కోసం దాదాపు 1.5 మిలియన్ల న్యూజిల్లాండ్ డాలర్ల స్కాలర్షిప్ ప్యాకేజీని ప్రకటించింది. 2023లో అత్యధికంగా మార్కులు సాధించే భారతీయ విద్యార్థులకు 200మందికి పైగా స్కాలర్షిప్ల్ను అందించనున్నట్లు ఆక్లాండ్ విశ్వవిద్యాలయం యొక్క ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఐన్ల్సీ మూర్ తెలిపారు. ద్వైవార్షికంగా ఈ స్కాలర్షిప్లను ఇవ్వబడతాయని ఇవి విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ ఆక్లాండ్ ఇండియా హై అచీవర్స్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు అక్టోబర్ 10 నుంచి స్వీకరిస్తామని, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇందుకు అర్హులని తెలిపింది.













