రష్యా, ఉక్రెయిన్ మధ్య డర్టీబాంబ్ వివాదం
రష్యా, ఉక్రెయిన్ మధ్య డర్టీ బాంబ్ వివాదం రేగింది. వాతావరణంలోకి రేడియోధార్మిక తను వెదజల్లి భయాందోళనలు సృష్టించేందుకు ఉక్రెయిన్ డర్టీబాంబును తయారు చేస్తున్నదని రష్యా ఆరోపించింది. ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లెవనెత్తేందుకు సిద్ధమవుతున్నది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్తోపాటు పశ్చిమదేశాలు ఖండిస్తున్నాయి. రష్యా దుష్ప్రచారం చేస్తున్నదని ఆరోపించాయి. ఉక్రెయిన్పై నెపం మోపి ప్రపంచదేశాల నడుమ పలుచన చేయాలని చూస్తున్నదని పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా రంగంలోకి దిగింది. ఉక్రెయిన్ లో పలు చోట్ల తనిఖీలు చేపట్టింది.













