త్వరలోనే వారికి గోల్డెన్ వీసాలు : యూఏఈ
వృత్తినిపుణులకు గోల్డెన్ వీసాలు జారీచేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయించింది. త్వరలోనే వారికి గోల్డెన్ వీసాలు ఇస్తామని యూఏఈ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. డాక్టరేట్ డిగ్రీలు ఉన్న వ్యక్తలు, మెడికల్ డాక్టర్లు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, పోగ్రామింగ్, ఎలక్ట్రికల్, బయోటెక్నాలజీ ఇంజనీర్లందరూ గోల్డెన్ వీసాకు అర్హులని యూఏఈ ఉపాధ్యక్షుడు, రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తౌమ్ వెల్లడించారు. ఈ వీసాలు పొందిన వారు మరో పదేళ్లు అక్కడ నివసించడానికి వీలు కలుగుతుంది.













