రితికా నయా చరిత్ర!
భారత యువ రెజ్లర్ రితిక హూడా కొత్త చరిత్ర నమోదు చేసింది. అండర్-23 ప్రపంచకప్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రితిక 76 కేజీల మహిళల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకుంది. దీంతో ఈ విభాగంలో స్వర్ణాని నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ పోటీలకు ముందు 72 కేజీల విభాగంలో పోటీ చేసిన రితిక ఈ ప్రపంచ కప్ కోసం తన బరువును 76 కేజీలకు మార్చుకుంది. ఫైన్ల్లో భారత్ యువ రెజ్లర్ రితిక 9`2 తేడాతో అమెరికా స్టార్ రెజ్లర్, మాజీ జూనియర్ ప్రపంచ ఛాంపియన్ కెన్నెడి డ్లాడ్స్ను చిత్తు చేసింది. ఒక దశలో 3-2తో ఉన్న రితిక తర్వాత వరుసల పాయింట్లు సాధిస్తూ మ్యాచ్‌ను 9-2తో ముగించి పసిడిని ముద్దాడింది. అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అండర్-20 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రితిక కాంస్య పతకం సాధించింది.













