నేనుండగా స్వీడన్, ఫిన్లాండ్ లను … రానీయను
నాటో కూటమిలోకి ఎంత తొందరగా చేరుదామా అని ఎదురు చూస్తున్న ఫిన్లాండ్, స్వీడన్లకు టర్కీ అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. తొలి నుంచీ ఈ రెండు దేశాలు ఉగ్రవాదానికి ఊతమిస్తున్నాయని టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్దోగన్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఆ దేశాల నాటో సభ్యతంపై ఘాటుగా వ్యాఖ్యాలు చేశారు. తాను టర్కీ అధ్యక్షుడిగా ఉండగా, ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్వీడన్, తమ దేశంలో ఉగ్రవాద కార్యక్రలాపాలు నిర్వహిస్తున్న కుర్దిష్ మిలిటెంట్లకు మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.













