టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం …తెలంగాణ వాసుల మృతి
అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నారాయణపేట జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు.. పెద్దచింతకుంటకు చెందిన నర్సింహారెడ్డి (56) హైదరాబాద్‌లో ఆర్టీసీ కండక్టర్. ఈయన కుమారుడు భరత్‌కుమార్ రెడ్డి (24), కూతురు మౌనికరెడ్డి (34) టెక్సాస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. రెణ్నెల్ల క్రితం నర్సింహారెడ్డి, భార్య లక్ష్మి (50)తో కలిసి అమెరికా వెళ్లాడు. శనివారం వారంతపు సెలవు కావడంతో భారత్‌కుమార్‌రెడ్డి తల్లిదండ్రులు, సోదరి మౌనికరెడ్డి, స్నేహితుడు సాయిప్రణీత్‌రెడ్డి, మరొకరితో కలిసి కారులో సాయి ప్రణీత్‌రెడ్డి ఇంటికి బయల్దేరారు.
మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నర్సింహారెడ్డి, ఆయన భార్య లక్ష్మి, కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి అక్కడికక్కడే మరణించారు. మౌనిక, సాయిప్రణీత్ తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నది. కారులో ఉన్న మరొకరి పరిస్థితి తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనతో పెద్ద చింతకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి మృతదేహాలను స్వగ్రామానికి తరలిచేందుకు ప్రభుత్వం సహకరించాలని నర్సింహారెడ్డి సోదరుడు శశిభూషణ్ కోరాడు. బాథిత కుటుంబానికి అండగా ఉంటామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పేర్కొంది.













