అమెరికా ఆంక్షలతో ఇబ్బందులు..

దేశంలో కరోనాఉధృతి నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో అనేకమంది హెచ్ 1బీ, హెచ్ 4 వీసాదారులు మనదేశంలో చిక్కుకుపోయారు. వీరు మూడేళ్లకోసారి వీసా రెన్యువల్ కోసం భారత్‍కు వస్తుంటారు. ఈ సారి వీసా రెన్యువల్ కోసం వచ్చి అమెరికా ఆంక్షల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.