తాకా ఆధ్వర్యంలో కెనడాలో వైభవంగా ఉగాది వేడుకలు
కెనడాలో తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్ 17 అంటే శనివారం నాడు ప్లవ నామ సంవత్సర ఉగాది సంబరాలను వర్చువల్‌గా నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 500 మందికిపైగా కెనడాలోని తెలుగు వారు పాల్గొని దీన్ని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి గారు, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ లయం గారు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటగా తాకా సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి గారి కుటుంబం జ్యోతి ప్రజ్వలనతో ఉగాది సంబరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆపై కెనడా మరియు భారత్ దేశ జాతీయ గీతాలను ఆలపించారు. టొరంటోలో ఉన్న తెలుగు పూజారి నరసింహాచార్యులు గారు పంచాంగ శ్రవణం చేసి, కొత్త సంవత్సర రాశి ఫలాలను అందరికి వివరించారు.
తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి గారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి, కోవిడ్-19 కష్ట కాలంలో తాకా చేస్తున్న ఎన్నో కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం తాకా వ్యవస్థాపక చైర్మన్ చారి సామంతపూడి గారు కెనడాలో తెలుగు వారందిరికీ ఎన్నో సేవలు అందిస్తున్న అల్బెర్టా మంత్రి శ్రీ పాండా ప్రసాద్ గారికి, సన్ డైన్ అధినేత్ శ్రీ శ్రీధర్ ముండ్లూరు గారికి, టొరంటో తెలుగు టైమ్స్ అధినేత్ శ్రీ సర్దార్ ఖాన్ గారికి ఉగాది పురస్కారాలను ప్రకటంచి వారి సేవలను కొనియాడారు.
తెలుగు చలన చిత్ర గాయకుడు దినకర్ కల్వల ఎన్నో మంచి పాత, కొత్త తెలుగు పాటలను పాడి కార్యక్రమంలో పాల్గొన్న వారందిరినీ అలరించారు. తరువాత చిరంజీవులు మాన్వి కార్యంపూడి, సంజిత చల్ల, సీత మైలవరపు, దుర్గ మైలవరపు, ఆశ్రిత్ పొన్నపల్లి, పూష్ని కోట్ల, శ్రిష్టి దామెరశెట్టి, తారుణి దేసు, మేధా గేదెల, శ్రీ వత్స సంక , శ్లోక కేశర్వాణి, అజయ్ అనమగండ్ల, సంయుత గందె, సాయిశ్రీ పులివర్తి, సహస్ర కోట, వైభవ్య కుప్పం, హరిలౌక్య కుప్పం, రోహన్ ముటుపూరుల పాడిన పాటలు, చేసిన నృత్యాలు అందరినీ ఎంతో ఉత్తేజపరిచాయి.
ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికాకి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల మరియు ట్రస్ట్ సభ్యులు బాషా షేక్, రామ చంద్రరావు దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసని తిరుచిరాపల్లిని, మరియు ఇతర వ్యవస్థాపక సభ్యులు రవి వారణాసి, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, లోకేష్ చిల్లకూరు, మునాఫ్ అబ్దుల్‌ను తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అభినందించారు. చివరిగా ట్రస్టీ చైర్మన్ బాషా షేక్ గారు కార్యక్రమంలో పాల్గొన్న వారందిరికి, దాతలకు, అతిధులకు ఇచ్చిన వందన సమర్పణతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.













