ఐటీ నిపుణులకు.. అక్రమ వీసాలు!

అమెరికాలో కార్యాలయాన్ని తెరిచి, కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ సాంకేతిక సంస్థ క్లౌడ్‍జెన్ ఎల్‍ఎల్‍సీ హెచ్-1బీ వీసా అక్రమాలకు పాల్పడినట్టు అంగీకరించింది. కన్సల్టేషన్, వ్యూహాత్మక సేవలను అందించే ఈ సంస్థ.. 2013 మార్చి నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు వీసా అక్రమాలకు పాల్పడినట్టు అగ్రరాజ్య న్యాయ విభాగం పేర్కొంది. భారతీయ ఐటీ నిపుణులు అమెరికా వచ్చేందుకు వీలుగా ఈ సంస్థ వారికి అక్రమ విధానంలో హెచ్-1బీ వీసాల మంజూరుకు తప్పుడు పత్రాలు సృష్టించింది. భారత్ నుంచి ఇలా వచ్చినవారిని దేశంలో వివిధ ప్రాంతాల్లో తలదాచుకునేలా ఏర్పాట్లు చేసింది. తర్వాత వారికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చేలా సంప్రదింపులు చేపట్టింది. ఇలా కొలువులు పొందినవారి జీతాల నుంచి ఆ సంస్థ కమిషన్‍గా 4,93,516 డాలర్లు (సుమారు రూ.3.6 కోట్లు) తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.