సింక్రోనీ కీలక నిర్ణయం.. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్
ఆర్థిక సేవల కంపెనీ సింక్రోనీ తమ ఉద్యోగులందరికీ శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఉద్యోగులు, వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే కంపెనీ నిబద్ధతకు నిదర్శనంగా నిలువడంతో పాటుగా తమ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మద్దతునందించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. సింక్రోనీ బిజినెస్ లీడర్ ఇండియా ఎస్విపిఆండీ పొన్నేరీ మాట్లాడుతూ సింక్రోనీ తన ఉద్యోగులను ఆస్తిగా భావిస్తుందని, వారి విజయానికి కట్టుబడి ఉన్మాని అన్నారు. సింక్రోనీలో ప్రస్తుతం 47 శాతం మంది ఉద్యోగులు మహిళలు, వీరితో పాటు 100 మందికి పైగా దివ్యాంగులు పనిచేస్తున్నారు.













