అమెరికాతో కలిసి కిమ్ పాలనను అంతం చేస్తాం
వరుస క్షిపణి ప్రయోగాలు, కవ్వింపు చర్యలతో ఉత్తర కొరియా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న వేళ దక్షిణ కొరియా సేనలు సియోల్ వీధుల్లో కదం తొక్కాయి. 75వ సాయుధ బలగాల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన సైనిక కవాతులో భాగంగా పెద్దఎత్తున ఆయుధ సంపత్తిని ప్రదర్శించాయి. ఈ స్థాయి ప్రదర్శన పదేళ్లలో ఇదే మొదటిసారి. ఉత్తర కొరియా ఆగడాలను కట్టడి చేసేందుకు పటిష్టమైన సైన్యాన్ని నిర్మిస్తామని దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యెల్ ఈ సందర్భంగా ప్రతినబూనారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలే ప్రయోగిస్తే అమెరికాతో కలిసి కిమ్ పాలనను అంతం చేస్తామని హెచ్చరించారు.













