కెనడాలో కార్చిచ్చు… అమెరికా ఉక్కిరిబిక్కిరి
కెనడాలో వ్యాపించిన కార్చిచ్చు అమెరికాలోని నగరాలకూ కష్టాలను తీసుకొచ్చింది. కెనడా నుంచి దట్టమైన పొగ అమెరికా నగరాలకు చేరుకొంది. దీంతో అక్కడ గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. గ్రేట్, లేక్, మధ్య, తూర్పు అమెరికాల్లో ఈ పొగ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ రక్షణ సంస్థ ఎయిర్నౌ.కామ్ ప్రకారం ఇల్లినాయిస్, లోయర్ మిషిగాన్, దక్షిణ విస్కన్సన్లో గాలి నాణ్యత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. షికాగో, డెట్రాయిట్, మిల్వాకీలో గాలి నాణ్యత అత్యల్ప స్థాయికి చేరిందని పేర్కొన్నారు. గాలినాణ్యత హెచ్చరికలను జారీ చేశారు. మిన్నియా పోలీస్, సెయింట్ పౌల్లో కూడా గగనతల మార్గాలు మొత్తం ఇలానే ఉంటాయని మిషిగాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని షికాగో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో చాలా వరకు డేకేర్ సెంటర్లు, క్రీడా ప్రాంగణాలు మూసివేశారు.













