యూఎస్ ఓపెన్ కు మరో స్టార్ దూరం
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి మరో స్టార్ తప్పుకుంది. మహిళల విభాగంలో దిగ్గజ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్న అమెరికా వెటరన్ స్టార్ సెరెనా విలియమ్స్ అమెరికా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది. తొడ కండరాల గాయం మళ్లీ తిరగ బడడంతో యూఎస్ ఓపెన్‌కు దూరం కాక తప్పడం లేదని సెరెనా పేర్కొంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకోవడం తనకు ఎంతో బాధకు గురి చేస్తుందని పేర్కొంది. అయితే గాయం తిరగబడడంతో టోర్నీ నుంచి వైదొలగడం మినహా తనకు మరో మార్గం లేకుండా పోయిందని సెరెనా ఆవేదన వ్యక్తం చేసింది.













