ఆమె అందరికి గొప్ప స్ఫూర్తి ప్రదాత
అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ అన్నాడు. ఈ ఏడాది యూఎస్ ఓపన్ తర్వాత సెరెనా వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. టెన్నిస్‌ను సెరెనా వీడడం బాధ కలిగిస్తోంది. అత్యుత్తమ క్రీడాకారిణుల్లో ఆమె ఒకరు. విలియన్స్తో కలిసి నేనూ టెన్నిస్ ప్రయాణాన్ని సాగించడం అదృష్టంగా భావిస్తున్నా. ఆమె అందరికి గొప్ప స్ఫూర్తి ప్రదాత. రిటైర్ అయ్యాక తనకు నచ్చింది ఎంచుకునే హక్కు సెరెనాకు ఉంది. విలియన్స్కు అభినందనలు అని నాదల్ పేర్కొన్నాడు.













