సంచలనం సౌదీలో ఒకే రోజు.. 81 మందికి
సౌదీ అరేబియాలో ఒకేరోజు 81 మందికి మరణశిక్ష అమలు చేసి సంచలనం సృష్టించింది. వీరంతా కూడా ఉగ్రవాద సంబంధిత నేరాలకు పాల్పడిన వారు కావడం గమనార్హం. వీరంత కూడా ఒక్కటికంటే ఎక్కువ హేయమైన నీచమైన నేరాలకు పాల్పడినవారేనని సౌదీ అరేబియా వెల్లడిరచింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, ఆల్‌ఖైదా, యెమెన్ హౌతీ రెబల్శక్తులకు చెందినవారు కూడా ఉన్నారు. సంపన్న గల్ఫ్ దేశం అయిన సౌదీ అరేబియా మరణశిక్షలు అమలు చేయడంలో కూడా అగ్రస్థానంలో ఉంది. తరుచూ తలలు నరికివేయడం వంటి భయానక శిక్షలతో కూడా ప్రపంచస్థాయి వార్తలోకి వస్తుంది. సౌదీ రాజ్యంలో కుట్రలకు ప్పాలడినట్లు వీరిపై అభియోగాలున్నాయి.













