యుఎస్ ఓపెన్లో రష్యా, బెలారస్ కు అనుమతి
యుఎస్ ఓపెన్లో రష్యా, బెలారస్ క్రీడాకారుల్ని అనుమతించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గత ఏప్రిల్లో ఈ రెండు దేశాల క్రీడాకారులపై నిషేధం విధించగా, యూఎస్ ఓపెన్ భిన్నమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాల చర్యలు, నిర్ణయాలకు వ్యక్తిగతంగా క్రీడాకారుల్ని జవాబుదారీగా చేస్తుండటం ఆందోలన కలిగించడంతో రష్యా, బెలారాస్ ప్లేయర్లను టోర్నీలో పాల్గొనడానికి అనుమతించాం అని యూఎస్ ఓపెన్ వ్యవహారాలు చూస్తున్న యూఎస్ టెన్నిస్ సంఘం సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ల్యూషెర్ పేర్కొన్నాడు. రష్యా, బెలారస్ క్రీడాకారులు తటస్థ పతాకం కింద ఆడతారని తెలిపాడు. ఆగస్టు 29న న్యూయార్క్లో యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది.













