అప్పటి వరకూ శాంతి అసాధ్యం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శాంతి ప్రణాళికపై రష్యా తీవ్ర స్థాయిలో మండిపడింది. యుద్ధ విరమణను తాము ప్రకటించాలంటే దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో అంతర్భాగాలుగా గుర్తించాలని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. అప్పటి వరకు శాంతి అసాధ్యమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్లు రష్యా సెప్టెంబరులో ప్రకటించింది. అంతకుముందు ప్రజాభిప్రాయ సేకరణ జరిపినట్లు పేర్కొంది. అయితే, ఈ చర్యకు ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా దళాలు ఇటీవల ఆక్రమించి విలీనం చేసుకున్న ఆ నాలుగు ప్రాంతాలతో పాటు 2014లో స్వాధీనం చేసుకున్న క్రిమియాను కూడా వదిలి వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. దాడి ప్రారంభానికి ముందు అంతర్జాతీయ సమాజం గుర్తించిన సరిహద్దుల ఆవలకు రష్యా సైన్యం వెళ్లిపోవాలని ఉక్రెయిన్ కోరుతోంది. కీవ్ డిమాండ్లను మాస్కో అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు.













