రష్యా అధ్యక్షుడు పుతిన్ దొంగ : అగ్రరాజ్యం
రష్యా అధ్యక్షుడు పుతిన్ను దొంగగా అభివర్ణించింది. అగ్రరాజ్యం అమెరికా, ఉక్రెయిన్ నుంచి వేల టన్నులు ఆహారధాన్యాలను దొంగలించి, వాటిని ఆప్రికా ఇతర దేశృాలకు చౌకగా అమ్ముతోందని పేర్కొంది. ఈ మేరకు మే నెలలో 14 దేశాలకు హెచ్చరిక లేఖలు రాసింది. ఇందులో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికా దేశాలే అత్యధికంగా ఉన్నాయి. ఈ దొంగలించిన ధాన్యాలు సుమారు 5 లక్షల టన్నులకు పైగా ఉంటాయని, వీటి విలువ 100 మిలియన్ డాలర్లకు పైనేనని తెలిపింది. ఇప్పటిక వివిధ నౌకశ్రయాలను నుంచి ఈ ఆహార ధాన్యాలతో నౌకలు గమ్యస్థానాలపైపు వెళ్లాయని కూడా పేర్కొంది.













