యూఎస్ ఓపెన్ కు రోజర్ ఫెదరర్ దూరం
టెన్నిస్ దిగ్గజం, స్విస్ యోధుడు రోజర్ ఫెదరర్ మూడోసారి మెకాలి శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపన్ సెమీ ఫైనల్ల్లో ఓటమి అనంతరం ఫెదరల్ రెండుసార్లు మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నారు. సుమారు 13 నెలల రిహాబిలిటేషన్ అనంతరం తిరిగి ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగారు. వింబుల్డన్‌కు ఫిట్‌గా ఉండటం కోసం పారిస్‌లో మూడో రౌండ్లోనే పోటీ నుంచి తప్పుకున్నారు. వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో వరుస సెట్లలో అనూహ్య పరాజయం చవిచూసిన ఫెధరల్.. ఇప్పుడు మరో శస్త్రచికిత్సకు రెడీ అయ్యారు. రానున్న కొన్ని వారాలు ఊతకర్రల సాయంతో నడవనున్నాను. ఆటకు చాలా మాసాలు దూరం కానున్నారు. దీర్ఘకాలికంగా మెరుగ్గా, ఫిట్‌గా ఉండేందుకు మరో సర్జరీ అవసరం. ఈ వయసులో మరో సర్జరీ సాహాసమే. అయినా, నేను ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. నాకు నిలుస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు అని ఫెదరల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇక పరిస్థితులను చూస్తుంటే ఫెదరర్ త్వరలోనే అంతర్జాతీయ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం లేదు. అయితే పోరాటానికి మరో పేరు గా చెప్పుకునే ఫెదరర్ ఎట్టి పరిస్థితిల్లోనూ తక్కువ అంచనా వేయలేం. మళ్లీ పుంజుకుని టైటిల్స్ గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు.













